మహిళ హత్య కేసులో పురోగతి

ABN , First Publish Date - 2021-02-28T05:51:28+05:30 IST

మహిళ హత్య కేసులో పురోగతి

మహిళ హత్య కేసులో పురోగతి

  • సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు

వికారాబాద్‌: శుక్రవారం రాత్రి హత్యకు గురై న మహిళ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. వికారాబాద్‌ ఆలంపల్లి, గిరిగేట్‌పల్లి మధ్య రైల్వే పట్టాలవద్ద అవుసుపల్లికి  చెందిన అమృతమ్మ(38) అనే అడ్డాకూలీ హత్యకు గురైంది. దీనిపై పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. డీఎస్పీ సంజీవరావు నేతృత్వంలో సీఐ రాజశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమృతమ్మ కూలికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరండంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తోటి అడ్డా కూలీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అమృతమ్మ అడ్డాపై నిరీక్షిస్తున్న సీసీఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అమె ఓ గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడటం, కలిసి ఆటోలో వెళ్లడం రికార్డయ్యాయి. ఆ వ్యక్తి ఆమెకు పని ఇస్తానని చెప్పి తీసుకెళ్లినట్టు భావిస్తున్నారు. అమృతమ్మను హత్యచేసి వొంటిపై ఉన్న 1గ్రాము బంగారు చెవి ఆభరణాలు, నగదు తీసుకున్నారు. బంగారం కోసమే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అమృతమ్మతో ఆటోలో వెళ్లిన వ్యక్తి పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో దోచిన బంగారం తాకట్టుకు వెళ్లగా ఆధార్‌ ఉంటేనే కుదువపెట్టుకుంటామని దుకాణదారుడు చెప్పడంతో గుర్తుతెలియని వ్యక్తి వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైంది. హంతకుడు పాత నేరస్థుడుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై డీఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ.. దర్యాప్తు కొలిక్కి వచ్చిందని, మహిళ హత్య కేసును త్వరలోనే ఛేదించి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-02-28T05:51:28+05:30 IST