పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి

ABN , First Publish Date - 2022-05-29T04:38:45+05:30 IST

పెండింగ్‌ కేసుల్లో పురోగతిని సాధించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఎస్పీలకు సూచించారు.

పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి
వీసీలో పాల్గొన్న ఎస్పీ

నారాయణపేట క్రైం, మే 28 : పెండింగ్‌ కేసుల్లో పురోగతిని సాధించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఎస్పీలకు సూచించారు. శనివారం అన్ని జిల్లాల ఎస్పీలతో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై డీజీపీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాలో బాల్యవివాహాలు, సైబర్‌ కేసుల నివారణకు తీసుకుంటున్న చర్యలను డీజీపీకి వివ రించారు. వీసీ లో డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రావు, సీఐలు శ్రీకాంత్‌ రెడ్డి, సీతయ్య, రాంలాల్‌, జనార్దన్‌, డీపీవో సూపరింటెండెంట్‌ శంకర్‌లాల్‌ పాల్గొన్నారు. 

నాసిరకం విత్తనాలపై నిఘా పెంచాలి

జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై నిఘా పెంచి నివా రణకు కృషి చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసు అధికారులతో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-29T04:38:45+05:30 IST