high security బీర్ జైలులో ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు...ముగ్గురు వార్డర్ల సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-04-07T13:28:01+05:30 IST

బీహార్ రాష్ట్రంలోని బీర్ హై సెక్యూరిటీ సెంట్రల్ జైలులో ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు వెలుగుచూసిన ఘటన సంచలనం రేపింది...

high security బీర్ జైలులో ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు...ముగ్గురు వార్డర్ల సస్పెన్షన్

పాట్నా(బీహార్): బీహార్ రాష్ట్రంలోని బీర్ హై సెక్యూరిటీ సెంట్రల్ జైలులో ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు వెలుగుచూసిన ఘటన సంచలనం రేపింది.జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులతో సహా పలు నిషేధిత వస్తువులు లభించడం కలకలం రేపింది.మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ వద్ద నుంచి ఏకే 47, రాకెట్ లాంచర్, హ్యాండ్ గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్న తర్వాత యూఏపీఏ కింద కేసు నమోదు చేసి అతన్ని బీర్ జైలుకు పంపించారు. బీర్ సెంట్రల్ జైలు సెల్ లోపల అనంత్ సింగ్ వద్ద నిషేధిత వస్తువులను కనుగొన్నారు.పాట్నా డిఎం చంద్రశేఖర్ సింగ్, ఎస్‌ఎస్‌పి మానవజీత్ సింగ్ ధిల్లాన్ ల నేతృత్వంలోని బృందం సెంట్రల్ జైలులో తనిఖీలు చేయగా ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు, బ్యాటరీ, ఫోన్ నంబరు రాసిన కాగితం ముక్కను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


జైలు ఆవరణలోని ఇతర ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ హీటర్లలో ఉపయోగించే స్ప్రింగ్‌లను గుర్తించారు.ఖైదీ ఎమ్మెల్యే సెల్ లో 9 మంది అటెండెంట్లను ఉంచారని తనిఖీల్లో తేలింది. దీంతో జైలు వార్డర్లు సురేంద్ర కుమార్, వీరేంద్ర కుమార్, వికాస్ చంద్ర సింగ్‌లను సస్పెండ్ చేశారు. ప్రత్యేక సాయుధ పోలీసు జవాన్ గౌరీ శంకర్‌ను సర్వీస్ నుంచి తొలగించారు.

Updated Date - 2022-04-07T13:28:01+05:30 IST