Ap News: గుడివాడ అమర్నాథ్‌కు మైండ్ దొబ్బింది: అనిత

ABN , First Publish Date - 2022-07-31T20:07:36+05:30 IST

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Minister Gudivada Amarnath)కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కౌంటరిచ్చారు.

Ap News: గుడివాడ అమర్నాథ్‌కు మైండ్ దొబ్బింది: అనిత

విశాఖ: మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Minister Gudivada Amarnath)కు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కౌంటరిచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్‌కు మైండ్ దొబ్బిందని ఎద్దేవాచేశారు. వైసీపీ (YCP) మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం (Prohibition on alcohol) లేదా? అని ప్రశ్నించారు. అనకాపల్లి ప్రజాసభలో ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పగలరా అని నిలదీశారు. వైసీపీ మేనిఫెస్టో చెత్తకాగితంతో సమానమన్నారు. మంత్రి అమర్నాథ్ క్షమాపణలు చెప్పేవరకు నిరసన తెలుపుతామని అనిత ప్రకటించారు.


‘‘మద్య నిషేధం అనేది మా మానిఫెస్టోలో లేదు. దశల వారీగా మద్యం ధరలను స్టార్‌ హోటల్‌ స్థాయిలో పెంచి సామాన్యులకు దూరం చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పాం’’ అని అమర్‌నాథ్‌ అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్రంగా మండిపడ్డారు. మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని మంత్రి చెప్పడంతో.. వైసీపీ మేనిఫెస్టోను లైవ్‌లో వంగలపూడి అనిత తగలబెట్టారు. 

Updated Date - 2022-07-31T20:07:36+05:30 IST