'ప్రాజెక్టు K': దీపిక ఉండేది వారం రోజులు మాత్రమే..?

Dec 8 2021 @ 10:06AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదికొన్ జంటగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్టు K'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీ పతాకంపై సి అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ షెడ్యుల్‌లో పాల్గొనేందుకు ముంబై నుంచి దీపక హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ - దీపికలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఇది చాలా చిన్న షెడ్యూల్ అని తెలుస్తోంది. కేవలం వారం రోజులు మాత్రమే దీపిక 'ప్రాజెక్టు K' చిత్రానికి డేట్స్ ఇచ్చిందట. ఈ నెల 15 నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' మూవీ షెడ్యూల్‌లో పాల్గొనబోతోందని సమాచారం. అందుకే ఈ లోపు చిన్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే 'సలార్', 'ఆదిపురుష్' చిత్రాలలోనూ ప్రభాస్ నటిస్తున్నారు.    

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.