కువైత్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2021-03-07T22:20:59+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ కువైత్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త కొవిడ్ బారినపడి కన్నుమూశారు. కువైత్ కేరళ ముస్లిం అసోసియేషన్ ఛైర్మన్ సాజీర్ త్రికరి

కువైత్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి

కువైత్ సిటీ: కరోనా మహమ్మారి విజృంభణ కువైత్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త కొవిడ్ బారినపడి కన్నుమూశారు. కువైత్ కేరళ ముస్లిం అసోసియేషన్ ఛైర్మన్ సాజీర్ త్రికరిప్పూర్ కొద్ది రోజుల కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సాజీర్‌ను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్ ద్వారా వైద్యులు చికిత్స అందించారు. ఆ క్రమంలో ఆయన కొద్ది గంటల క్రితం తుది శ్వాస విడిచారు. కాగా.. సాజీర్ త్రికరిప్పూర్.. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆర్థిక కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారిని చేరదీసి, సాయం చేసేవారు. ఇదిలా ఉంటే.. సాజీర్ త్రికరిప్పూర్ భార్య కూడా కరోనా బారినపడి కొద్ది రోజుల క్రితమే మరణించారు. రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. గడిచిన 24గంటల్లో కువైత్‌లో దాదాపు 1300 మంది కరోనా బారినపడగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1.99లక్షలకు చేరింది. ఇదే సమయంలో 1,120 మంది మహమ్మారికి బలయ్యారు. 


Updated Date - 2021-03-07T22:20:59+05:30 IST