2022లో కాంగ్రెస్‌ను వీడిన ప్రముఖులు వీరే..

ABN , First Publish Date - 2022-05-26T02:23:13+05:30 IST

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్‌ను ఏడాది కాలంలో వీడిని ప్రముఖుల జాబితాలో కపిల్ సిబల్ తాజాగా..

2022లో కాంగ్రెస్‌ను వీడిన ప్రముఖులు వీరే..

న్యూఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్‌ (Congress)ను ఏడాది కాలంలో వీడిని  ప్రముఖుల (prominent people) జాబితాలో కపిల్ సిబల్ (kapil sibal) తాజాగా వచ్చి చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన సిబల్ బుధవారంనాడు స్వతంత్ర అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు. దీనికి ముందు పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ (Sunil jakhad) కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీలో చేరేందుకే ఆయన రాజీనామా చేయగా, సిబల్ మాత్రం కాంగ్రెస్‌తో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని నెమరువేసుకుంటూ, రాజీనామా నిర్ణయం అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదన్నారు.


కాగా, దీనికి ముందు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్విన్ కుమార్, మరో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. ఇటీవలే గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పాటిల్ సైతం ఆ పార్టీకి రాజీమామా చేసారు. బీజేపీలో ఇవాళో రేపో చేరుతారనే ప్రచారమూ సాగుతోంది. సునీల్ జాఖర్ గతవారం బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌తో 5 దశాబ్దాల అనుబంధం తనకుందని, పార్టీ బాగున్నప్పుడు, క్లిష్ట సమయాల్లోనూ తాను వెన్నంటి ఉన్నానని, అయితే కాంగ్రెస్‌లో తన జాతీయవాద గళాన్ని అణచివేసే ప్రయత్నం జరగిందని అన్నారు. ఇక, హార్దిక్ పటేల్ హిందుత్వ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రజల మనోభావాలను, హిందూ మత విశ్వాసాలను కాంగ్రెస్ ఎప్పుడూ దెబ్బతీస్తూనే వచ్చిందన్నారు. ఆర్‌పీఎన్‌ సింగ్ సైతం యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిపోయారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకుని బీజేపీతో అవగాహన కుదుర్చుకోవడం ద్వారా ఎన్నికల్లో దిగారు. గాంధీ కుటుంబ సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద సైతం గత ఏడాది కాంగ్రెస్‌ను వీడారు.

Updated Date - 2022-05-26T02:23:13+05:30 IST