ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి

ABN , First Publish Date - 2021-03-09T05:04:40+05:30 IST

ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ రాజకుమారి ట్రైనీ అసిస్టెంట్‌ ఎస్పీగా నల్గొండ, ఏఎస్పీగా నూజివీడు, అడిషనల్‌ ఎస్పీగా నిజమాబాద్‌, ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా మంగళగిరిలో బాధ్యతలు నిర్వహించారు.

ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి
ఎస్పీ రాజకుమారి

విజయనగరం క్రైం, మార్చి 8 : ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఎస్పీ రాజకుమారి ట్రైనీ అసిస్టెంట్‌ ఎస్పీగా నల్గొండ, ఏఎస్పీగా నూజివీడు, అడిషనల్‌ ఎస్పీగా నిజమాబాద్‌, ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా మంగళగిరిలో బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా మొదట రాజమండ్రి అర్బన్‌లో విధులు నిర్వహించారు. 2019 జూన్‌లో విజయనగరం ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో త నదైన పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని అదుపు చేయడంలో విశేషంగా కృషి చేశారు. ఇందుకు గాను ఆమెకు జాతీయ స్థాయిలో మహిళా వారియర్‌గా గుర్తింపు లభించింది. కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌ నుంచి గత నెలలో పురస్కారాన్ని అందుకున్నారు. ఎస్పీ రాజకుమారికి డీఐజీగా పదోన్నతి రావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-03-09T05:04:40+05:30 IST