Advertisement

ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి కార్యదర్శులుగా పదోన్నతులు

Jan 23 2021 @ 23:56PM

ఖిల్లా, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో పని చేస్తున్న ప లువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా మొత్తం 32 మందికి అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉమ్మడి జిల్లాకు చెందిన వారు ఐదుగురు అర్హులుగా ఉన్నా రు. వీరిలో అసిస్టెంట్‌ కార్యదర్శులుగా ఉన్న వారిని గ్రేడ్‌-1కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌గా పని చేసిన స్వరూపరాణి ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఆస్థానాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న విజయ్‌కిషోర్‌తో భర్తీ చేశారు. విజయ్‌కిషోర్‌ కొంతకాలంగా నిజామాబాద్‌, హైదరాబాద్‌ మార్కెట్‌యార్డ్‌లో సీనియర్‌ అ సిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే మార్కెట్‌ యార్డ్‌లో అసిస్టెంట్‌ కార్యదర్శిగా పని చేసిన మెర్సిను పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. మరో ము గ్గురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Follow Us on:
Advertisement