ఆస్పత్రికొచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:37:31+05:30 IST

ఆస్పత్రికొచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలి

ఆస్పత్రికొచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలి
అధికారులతో మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌

మేడ్చల్‌, మే 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వ చ్చే రోగులకు వైద్యులు అన్ని రకాల చికిత్సను అందించాలని డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ‘బి’బ్లాక్‌లో వైద్యులు, ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల్లో కేసీఆర్‌ కిట్‌, టెలీ మెడిసిన్‌, ఆరోగ్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ, చిన్నపిల్లలకు టీకాలు, కొవిడ్‌ వాక్సినేషన్‌ను తప్పనిసరిగా వేయాలన్నారు. అనవసర సిజేరియన్లు జరుగకుండా చూడాలన్నారు. జూన్‌ 3లోపు ఆరోగ్యశాఖ మంత్రితో జరిగే సమీక్ష నాటికి వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను అధిగమించాలన్నారు.

Updated Date - 2022-05-24T05:37:31+05:30 IST