హైదరాబాద్‌లో ఆస్తుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారా?.. ఇక ఆలస్యం చేయొద్దు!

ABN , First Publish Date - 2022-10-03T03:13:56+05:30 IST

హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు చుట్టుపక్కల ఆస్తుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారా? ప్రాపర్టీ, ప్లాట్స్‌లలో పెట్టుబడి

హైదరాబాద్‌లో ఆస్తుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారా?.. ఇక ఆలస్యం చేయొద్దు!

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు చుట్టుపక్కల ఆస్తుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారా? ప్రాపర్టీ, ప్లాట్స్‌లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే, ఇక ఎంతమాత్రమూ ఆలస్యం చేయొద్దు. ఆస్తుల కొనుగోలుకు ఇదే చాలా అనువైన సమయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు స్థిరంగా అత్యుత్తమ స్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు హైదరాబాద్ మార్కెట్‌పై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నారు. అయితే, జీవో 111 కారణంగా గత ఆరు నెలలుగా హైరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ జీవో కారణంగా ఎటువంటి ప్రభావం ఉంటుందోనని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ప్లాట్ కొనుగోలుదారులకు అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జీవో 111 కారణంగా రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టుపక్కల ప్లాట్స్‌‌కు డిమాండ్‌ పెరిగింది. 


అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని ఆస్తుల ధరలు బాగా పెరిగాయి. ఈ జీఓను రద్దుచేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కాబట్టి  ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల ప్లాట్‌ కొనుగోలు ఏరకంగా చూసినా ప్రయోజనకరమే.  ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో పెద్ద పెద్ద సంస్థలన్నీ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.  హైదరాబాద్‌ చుట్టు పక్కల కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి కనిపిస్తోంది. అన్ని ప్రాంతాల శరవేగంగా విస్తరిస్తుండటంతో పాటు భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌ , వనస్థలిపురం, ఇంజాపూర్‌లలో  రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో  వేగవంతంగా పెరుగుదల కనిపిస్తుంది.  బీఎన్‌ రెడ్డి నగర్‌ , సాహెబ్‌ నగర్‌ కలాన్‌, గుర్రం గూడా వంటివి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. నాగార్జున సాగర్‌ రోడ్‌కు సమీపంలో  హైదరాబాద్‌కు దక్షిణాన,  ఔటర్‌ రింగ్‌ కోడ్‌కు లోపల ఉండటం వల్ల తమ సొంత ప్లాట్‌ కోనుగోలు చేయాలనుకునే, తమ సొంత ఇంటి నిర్మాణం చేయాలనుకునే కొనుగోలుదారులకు అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుంది. ఈ ప్రాంతాలు అత్యంత సురక్షితమైన పెట్టుబడి  మార్గాలుగా ఉండటంతో పాటు అత్యధిక విలువను కూడా అందిస్తాయి.

 

ఈ  ప్రాంతాల్లో ఏదైనా ప్లాట్‌ లేదంటే ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు తమ పెట్టుబడులను గురించి పూర్తి నిశ్చింతతతో  ఉండొచ్చు. వారి ప్రాపర్టీ విలువ గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అనుమతించిన ప్రాజెక్టులన్నింటిపై జీవో 111 ప్రభావమేమీ ఉండదు. ఈ ప్రాంతంతో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాలలో  తమ పెట్టుబడులను గురించి కొనుగోలుదారులు పూర్తి నిశ్చింతతో ఉండవచ్చు.

Updated Date - 2022-10-03T03:13:56+05:30 IST