ఆస్తిపన్నును త్వరితగతిన వసూలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-26T05:17:04+05:30 IST

పట్ట ణాల్లో ఆస్తివిలువ ఆధారంగా పెంచిన ఆస్తిపన్ను ల వసూలును వేగవంతం చేయాలని మునిసిప ల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు ఆదేశించా రు.

ఆస్తిపన్నును త్వరితగతిన వసూలు చేయాలి
మాట్లాడుతున్న ఆర్డీ శ్రీనివాసరావు

 


మునిసిపల్‌ ఆర్డీ శ్రీనివాసరావు


ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 25 : పట్ట ణాల్లో ఆస్తివిలువ ఆధారంగా పెంచిన ఆస్తిపన్ను ల వసూలును వేగవంతం చేయాలని మునిసిప ల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు ఆదేశించా రు. గురువారం ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయ ంలో ఒంగోలుతోపాటు జిల్లాలోని ఎనిమిది ముని సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఆస్తిపన్ను వసూ లు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అదేవి ధంగా బకాయిలదారులకు నోటీసులు జారీ చే యాలని, అవసరమైతే మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్‌లకు ప్యాచ్‌వ ర్క్‌లు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లో నూత నంగా ప్రతిపాదించిన అర్బన్‌క్లినిక్స్‌, పాత వాటికి మరమ్మతుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. క్లీన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, ప్రతి ఇంటికి మూడు బు ట్టల విధానం సక్రమంగా అమలు చేయాలని, అ దేవిధంగా చెత్తపై పన్ను వసూలు త్వరితగతిన ప్రారంభించాలన్నారు. టిడ్కో ఇళ్ళను పొందిన ల బ్ధిదారులు బ్యాంకులకు సకాలంలో రుణాలు తిరి గి చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆర్డీ తెలిపారు. వీటితోపాట అక్రమ లేఅవుట్‌ల క్రమబద్దీకరణ, తాగునీరు పన్ను, నాన్‌ట్యాక్స్‌, 14, 15 ఆర్ధిక సం ఘం నిధులపై చర్చించారు. సమావేశంలో నగర కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి తదితనేలే పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T05:17:04+05:30 IST