ప్రవక్తే బతికి ఉంటే.. వాళ్ల పిచ్చిని చూసి ఆశ్చర్యపోయేవారు: Taslima Nasreen

ABN , First Publish Date - 2022-06-12T02:27:31+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండటం, దేశంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ఘటనలు...

ప్రవక్తే బతికి ఉంటే.. వాళ్ల పిచ్చిని చూసి ఆశ్చర్యపోయేవారు: Taslima Nasreen

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్త (prophet Muhammad)పై వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండటం, దేశంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో దీనిపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా (Taslima nasreeen) నస్రీన్ స్పందించారు. ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని వ్యాఖ్యానించారు.


''మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉన్మాదుల పిచ్చితనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు'' అని ఆ ట్వీట్‌లో తస్లీమా అన్నారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.


కాగా, కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అసహనంపై తస్లీమా మాట్లాడారు. భారతీయ దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. కరాచీలోని కోరంగి ప్రాంతంలో ఉన్న శఅరీ మరి మాతా మందిర్‌లోని విగ్రహాలపై దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్‌లోనే కాకుండా, బంగ్లాదేశ్‌లోనూ అసహనం పెరుగుతోందన్నారు. ముస్లింలు ముస్లిమేతరులతో జీవించడం నేర్చుకోవాలని, మనుషులుగా గుర్తించాలని హితవు అన్నారు. భారతదేశ ఉత్పత్తులను దేశం వెలుపల ముస్లింలు బాయ్‌కాట్ చేయడం అనేది పెద్ద లెక్కల్లోకి ఏమీ రాదని అన్నారు. మనిషి, సాధువు, భగవంతుడు, జీసస్, ప్రవక్త ఎవరూ విమర్శలకు అతీతులు కాదనీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి విమర్శనాత్మక పరిశీలన అవసరమని తస్లీమా ట్వీట్ చేశారు.

Updated Date - 2022-06-12T02:27:31+05:30 IST