టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-07-02T00:16:52+05:30 IST

పాపికొండల బోట్ షికారుకు ముందుగా ఆరు టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు: మంత్రి అవంతి

రాజమంఢ్రి: రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గురువారం దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. 2019 సెప్టెంబర్ 15న కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజాన్ని 21 నెలల పాటు నిలిపివేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాపికొండల బోట్ షికారుకు ముందుగా ఆరు టూరిజం బోట్లకు అనుమతి ఇచ్చామన్నారు.  గత సంఘటన దృష్ట్యా రాష్ట్రంలో బోటు షికార్ల పర్యవేక్షణకు తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పర్యాటకలు ఎవరూ బోట్ షికారులో  లిక్కర్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద  టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మరో నెలరోజుల్లో పోలవరం వద్ద  ఏర్పాటు చేయబోయే టూరిజం ప్రాజెక్టులపై స్పష్టత వస్తుందన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం తరహాలో పోలవరం వద్ద టూరిజం అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. పోలవరం, గండిపోశమ్మ, పేరంటాళ్లపల్లి ట్రైసర్క్యూట్గా టూరిజం అభివృద్ధి చేస్తామని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-02T00:16:52+05:30 IST