పశువుల మేత భూమిని కాపాడండి

ABN , First Publish Date - 2022-08-18T04:36:44+05:30 IST

సీఎ్‌సపురం గ్రామంలోని పశువుల మేత పోరంబోకు భూమి స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మాజీ సర్పంచ్‌ తిరుమలశెట్టి శివాజీకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

పశువుల మేత భూమిని కాపాడండి

సీఎ్‌సపురం, ఆగస్టు 17 : సీఎ్‌సపురం గ్రామంలోని పశువుల మేత పోరంబోకు భూమి స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మాజీ సర్పంచ్‌ తిరుమలశెట్టి శివాజీకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దాని సారాంశం... సీఎ్‌సపురం సర్వేనెంబర్‌ 146/2లో 1984వ సంవత్సరంలో ఎన్‌జీవోలకు మార్కెట్‌ విలువ కట్టించుకోకుండా, పశువుల మేత భూమిని అసైన్‌మెంట్‌ భూమిగా మార్చకుండా పేదలకు ఇచ్చే స్థలం లెక్కన పట్టాలు పంపిణీచేశారు. ఈ విషయంపై గతంలో కొంతమంది ఎన్‌జీవోలు హైకోర్టును ఆశ్రయించగా ఆ పట్టాలను రద్దుచేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఎన్‌జీవోల పట్టాలను కోర్టు రద్దుచేసినా కూడా కొంతమంది దళారులు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చినపుడు సంబంధిత భూమిలో ఫెన్సింగ్‌ రాళ్లు పాతడం, చిల్లచెట్లను తొలగించడం, స్థలాన్ని చదును చేస్తున్నారు. తహసీల్దార్‌కు ఎన్నిసార్లు అర్జీ రూపంలో తెలిపినా భూమిలోని ఆక్రమణలను తొలగించడంలేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పశువుల మేత భూమిలో వేసిన ఫెన్సింగ్‌ రాళ్లను తొలగించి స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలని శివాజీకుమార్‌ కోరారు.

Updated Date - 2022-08-18T04:36:44+05:30 IST