మాడ్గుల : మండలంలోని పాత బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయ స్థలాన్ని కొంతమంది అక్రమంగా ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేశారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు.సర్వేనెంబర్ 110లో ఉన్న 1.07 గుంటల భూమిని సర్వే చేయించి, అట్టి స్థలాన్ని దేవాలయానికి కేటాయించాలని కలెక్టర్, ఆర్డీవోలకు విన్నవించామని ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.రాములు ఆరోపించారు. గ్రామ సర్పంచ్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు.