భూసారాన్ని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:04:12+05:30 IST

సంవత్సరాల తరబడి పంటమార్పిడి లేక పోవటంతో భూసారం దెబ్బతిన్నదని, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి రైతులకు సూచించారు.

భూసారాన్ని పరిరక్షించాలి
మాట్లాడుతున్న ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి

రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి

నేలకొండపల్లి, జులై6: సంవత్సరాల తరబడి పంటమార్పిడి లేక పోవటంతో భూసారం దెబ్బతిన్నదని, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి రైతులకు సూచించారు. బుధవారం నేలకొండపల్లి వాసవీభవన్‌లో నెల్లూరి వారబాబు, యలమద్ది లెనిన్‌ అధ్యక్షతన జరిగిన భక్తరామదాసు సర్వీస్‌ సొసైటీ, కామధేనురైతు ఉత్పత్తి సంస్ధలు సంయుక్తంగా నిర్వహించిన రైతు సదస్సులో మాట్లాడారు. రైతులు వాణిజ్య, ఉద్యానవన పంటలను సాగు చేయటం ద్వారా లాభాలు గడించాలన్నారు.    కామధేను రైతుఉత్పత్తి సంస్ధకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందచేస్తానని, సంస్ధ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాక్షించారు. సహాయ సంచాలకులు మధుసూధన్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యానాధికారి అనసూయ తదితరులు రైతులకు సూచనలు చేశారు. సదస్సులో సొసైటీ అధ్యక్షుడు యలమద్ది లెనిన్‌, కామధేను ఉత్పత్తి సంస్ధ ఛైర్మన్‌ నెల్లూరి వీరబాబు, ప్రధాన కార్యదర్శి పాలడుగు పూర్ణచంద్రప్రసాద్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు, చావా గణపతిరావు, పొన్నగాని శ్రీను, వాసం లక్ష్మయ్య, దేవీప్రసాద్‌, కొత్తా జనార్ధనరావు, ఏటుకూరి వెంకటరామారావు, రాయల రమేష్‌, వెల్లంపల్లి నరేంద్రస్వరూప్‌, వల్లంచెట్ల భాస్కరరావు, వలసాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:04:12+05:30 IST