వానల్లో చర్మ సంరక్షణ!

ABN , First Publish Date - 2021-09-08T05:30:00+05:30 IST

వానాకాలంలో చర్మం, జుట్టు సమస్యలు తలెత్తే అవకాశాలెక్కువ. ముఖ్యంగా తేమ ఉండటం వల్ల దురదలొస్తాయి. సోమరితనం కూడా ఆవహిస్తుంది. ధర ఎక్కువ ఉండే సౌందర్య లేపనాలు వాడవసరం లేకుండా చిన్నపాటి టిప్స్‌తో వానాకాలంలోనూ...

వానల్లో చర్మ సంరక్షణ!

వానాకాలంలో చర్మం, జుట్టు సమస్యలు తలెత్తే అవకాశాలెక్కువ. ముఖ్యంగా తేమ ఉండటం వల్ల దురదలొస్తాయి. సోమరితనం కూడా ఆవహిస్తుంది. ధర ఎక్కువ ఉండే సౌందర్య లేపనాలు వాడవసరం లేకుండా చిన్నపాటి టిప్స్‌తో వానాకాలంలోనూ మీ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...


  1. అలవాటున్న వాళ్లు అన్నికాలాల్లో లాగే వానాకాలంలోనూ స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ వాడతారు. మీరు ఎన్ని వాడినా సరైన సమయంలో ఆహారం తీసుకోకుంటే ఫలితం ఉండదు. చర్మసౌందర్యం దెబ్బతింటుంది. రెగ్యులర్‌గా మార్కెట్లో దొరికే సీజనల్‌ ఫ్రూట్స్‌ను మాత్రం కచ్చితంగా తినాల్సిందే. దీని వల్ల మేని ఆరోగ్యం మెరుగవుతుంది.
  2. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. దప్పిక ఉన్నపుడు మంచి నీటిని కచ్చితంగా తాగాలి. అది వానాకాలం అయినా సరే.. తాగాల్సిందే. నీరు తాగడం ఇబ్బంది అనిపిస్తే పండ్ల రసాలు, టీ లేదా సూప్‌లు తాగితే మంచిది.
  3. పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలను తింటే మంచిది. ఇందులోని ఇ విటమిన్‌ చర్మానికి  మంచిది. వీటితో పాటు చక్కెర, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి చిన్న టిప్స్‌ తీసుకుంటే సరి.. వానాకాలంలో చర్మ ఆరోగ్యానికి ఢోకాలేదు.

Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST