ఆక్సిజన్‌ ట్యాంకుకు రక్షణ!

ABN , First Publish Date - 2021-05-10T04:44:21+05:30 IST

కొవిడ్‌ విజృంభణతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగింది. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులు పేలి పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.

ఆక్సిజన్‌ ట్యాంకుకు రక్షణ!
గడ్డకట్టిన ట్యాంకును కరిగిస్తున్న ఫెర్‌ సిబ్బంది

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విజృంభణతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగింది. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులు పేలి పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరా, ట్యాంకుల విషయంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీహెచ్‌లోని కొవిడ్‌ వార్డుకు సరఫరా చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు ఉంది. ఇందులో ఆక్సిజన్‌ ద్రవరూపంలో ఉంటుంది. ట్యాంక్‌ చల్లదనానికి చుట్టూ ఉన్న గాలి పేరుకుపోయి ట్యాంక్‌కు పట్టేసింది. కొన్ని నిమిషాల్లో మొత్తం గడ్డగా మారడంతో లోపల ద్రవరూపం లో ఉన్న ఆక్సిజన్‌ కూడా గడ్డ కట్టి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని భావించిన అధికారులు అగ్ని మాపకశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ శాఖ సిబ్బం ది ట్యాంక్‌ చుట్టూ పేరుకున్న గడ్డను నీటితో కరిగించారు.  

Updated Date - 2021-05-10T04:44:21+05:30 IST