తాళ్లతో చెట్లకు రక్షణ!

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్‌లు పెట్టడం చూస్తుంటాం. కానీ జపాన్‌లో ఏకంగా చెట్లకు రక్షణగా తాళ్లను

తాళ్లతో చెట్లకు రక్షణ!

మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్‌లు పెట్టడం చూస్తుంటాం. కానీ జపాన్‌లో ఏకంగా చెట్లకు రక్షణగా తాళ్లను ఏర్పాటు చేస్తారు. ఎందుకో తెలుసా? 


జపాన్‌లో చలికాలంలో మంచు కురుస్తుంది. చెట్ల కొమ్మలపై మంచు పేరుకుపోతే ఆ బరువుకి కొమ్మలు విరిగిపోతాయి. కొన్నేళ్లుగా ఈ మంచువల్ల చాలా చెట్లు విరిగిపోయాయి. 


ఆ చెట్లను కాపాడుకోవడం కోసం అక్కడి అధికారులు ఒక వినూత్న ప్రయోగం చేశారు. చెట్టు మధ్యలో కర్రను పాతి దాని చుట్టూ తాళ్లను శంఖంలా కట్టి చూశారు. వాటిని స్నో సస్పెండర్స్‌ అని అంటారు. ఆ ప్రయోగం ఫలితం ఇవ్వడంతో అన్ని చెట్లకు తాళ్లను ఏర్పాటు చేశారు. 




ప్రస్తుతం ఆ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. రాత్రివేళ చెట్ల మధ్యలో ప్రత్యేక లైట్లు అమర్చడంతో అవి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఆ సుందరదృశ్యాన్ని చూడటానికి ప్రజలు పార్కులను సందర్శిస్తుంటారు.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST