కరోనా మృతుల కుటుంబాలపై వివక్ష తగదు

ABN , First Publish Date - 2021-06-17T04:22:45+05:30 IST

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. బుధవారం స్థానిక తహసీల్దారు

కరోనా మృతుల కుటుంబాలపై వివక్ష తగదు
తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన

ఆత్మకూరు, జూన్‌ 16 : కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఎ్‌సవోకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ తుమ్మల చంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కేతా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేలు, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని కోరా రు. ఆనందయ్య మందు తయారీకీ అవసరమైన వస్తువులు ప్రభుత్వం అందించి ప్రజలందరికీ ఆ మందు సరఫరా అమ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లునాయు డు, టీడీపీ నేతలు తోడేటి పెంచలయ్య, మధు, నరేష్‌, ఈ.పెంచలయ్య, పూనూరు రమేష్‌, మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:22:45+05:30 IST