మార్కెట్‌ నిధుల మళ్లింపుపై నిరసన

ABN , First Publish Date - 2022-05-24T05:26:00+05:30 IST

కాగజ్‌నగర్‌ మార్కెట్‌ నిధులను సిద్దిపేట మార్కెట్‌ అభివృద్ధికి తరలించడంపై బీజేపీ నాయకులు సోమవారం మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

మార్కెట్‌ నిధుల మళ్లింపుపై నిరసన
మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న బీజేపీ నాయకులు

కాగజ్‌నగర్‌, మే 23: కాగజ్‌నగర్‌ మార్కెట్‌ నిధులను సిద్దిపేట మార్కెట్‌ అభివృద్ధికి తరలించడంపై బీజేపీ నాయకులు  సోమవారం మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిర్పూరు నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు మాట్లాడారు. కాగజ్‌నగర్‌ మార్కెట్‌ నిధులను సిద్దిపేట మార్కట్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. కాగజ్‌నగర్‌ రైతుల నుంచి సెస్‌ వసూలు చేసిన సొమ్ము 2కోట్ల రూపాయలు ఏకంగా సిద్దిపేట మార్కెట్‌ కమిటీకి తరలించడం దారుణమని చెప్పారు. ఈ విష యంలో స్థానిక ఎమ్మెల్యే కోనప్ప మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. మార్కెట్‌ నిధులను వడ్డీతో సహా వసూలు చేసి ఇక్కడే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మార్కెట్‌ కమిటీ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోలెం వెంక టేష్‌, నాయకులు ఈశ్వర్‌ దాస్‌, గజ్జి ప్రసాద్‌, ఉమ్మెర బాలకృష్ణ, దెబ్బటి శ్రీనివాస్‌, మా జీ కౌన్సిలర్‌ దెబ్బటి శ్రీనివాస్‌, పుల్ల ఆశోక్‌, మాచర్ల శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, చిప్పకుర్తి రమేశ్‌, ఆశోక్‌కుమార్‌, అనిల్‌, పోచయ్య, రాజేం దర్‌ జంజోడ్‌, గోవింద్‌ మండల్‌, పాగిడే రాకేష్‌, భీమన్కార్‌ బాబురావు, గణపతి, కౌశిక్‌, రాజు, తిరుపతి రవి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:26:00+05:30 IST