విద్యుత్‌ కోతలతో నష్టపోతున్నాం

ABN , First Publish Date - 2022-05-28T06:13:44+05:30 IST

విద్యుత్‌ కోతలతో నష్టపోతున్నాం

విద్యుత్‌ కోతలతో నష్టపోతున్నాం
సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆక్వా రైతులు

 సబ్‌ స్టేషన్‌ వద్ద ఆక్వా రైతుల ధర్నా
 నిరసనలో పాల్గొన్న వైసీపీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, జాన్‌వెస్లీ

ఆకివీడు, మే 27: విద్యుత్‌ కోతలతో నష్టపోతున్నామని, సమస్యను పరిష్కరించాలని ఆక్వా రైతులు, వైసీ పీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విద్యుత్‌ స బ్‌స్టేషన్‌ దగ్గర ధర్మాపురం అగ్రహారానికి చెందిన ఆక్వా రైతులు కె.జాన్‌, రాజేష్‌, మోషే, కంతేటి రామరాజు, వేగేశ్న రామరాజు, వైసీపీ కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, జాన్‌ వెస్లీ ధర్నా చేశారు. ఏఈ ప్రసాద్‌రాజుకు వినతిపత్రం అందజేశారు. కరోనాతో ఆక్వా రైతులు కుదేలయ్యారని, వడ్డీలకు తెచ్చి చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారని, 12 గంటల పైనే సరఫరా నిలుపుదల చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోనూ ఇదే పరిస్థితి ఉం దంటూ వైసీపీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, జాన్‌ వెస్లీ ఏఈ ని నిలదీశారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే జనం రోడ్లమీద కొస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాజర్‌, నోహాన్‌, ఆర్‌.శ్యామ్‌, కుమార్‌, చౌదరి పాల్గొన్నారు.







వాతావరణ మార్పులతో మార్కెట్‌కు అధిక సరుకు
ఆకివీడు: వాతావరణంలో మార్పులు, గంటల కొద్దీ విద్యుత్‌ కో తలతో చేపలు, రొయ్యలకు ఆక్సిజన్‌ అందక తేలిపోతున్నాయని రై తులు చెబుతున్నారు. చేపలు, రొయ్యల ధరలు ప్రస్తుతానికి బా గుండడంతో లాంచీలరేవు హోల్‌సేల్‌ మార్కెట్‌కు తెచ్చి ఎంతో కొం త సొమ్ము చేసుకోవచ్చని అమ్ముకుంటున్నారు. మార్కెట్‌కు రోజూ 2 టన్నుల సరుకు వచ్చేదని శుక్రవారం 4 టన్నులకు పైనే వచ్చిం దని కమీషన్‌ వ్యాపారి షేక్‌ సుభాని, కేశిరెడ్డి శ్రీను తెలిపారు.

Updated Date - 2022-05-28T06:13:44+05:30 IST