నిరసన వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు
మొగల్తూరు, జూలై 5: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మొగల్తూరులో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ఉ పాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఆశ వర్కర్ల గౌరవ వేతనం రూ.15వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కొవిడ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందించాలన్నారు. టి.వరలక్ష్మి, జీబీఎస్ కుమార్, పీవీ లక్ష్మి, బేబి పాల్గొన్నారు.