రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2022-06-28T05:14:24+05:30 IST

సీఎం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రజకవృత్తి దోభీఘాట్ల పరిరక్షణసమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెన్నూరి చెన్నయ్య డిమాండ్‌ చేశారు

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
కలెక్టరేట్‌ ఎదుట శిరోముండనం చేయించుకుంటూ నిరసన తెలుపుతున్న రజకవృత్తి దోభీఘాట్ల పరిరక్షణసమితి అధ్యక్షుడు చెన్నూరి చెన్నయ్య

కలెక్టరేట్‌ ఎదుట వినూత్న నిరసన

గుంటూరు(తూర్పు), జూన్‌  27: సీఎం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రజకవృత్తి దోభీఘాట్ల పరిరక్షణసమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెన్నూరి చెన్నయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం శిరోముండనం చేయించుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల మంది ఉన్న రజకులపై ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రజకులను ఎస్సీల్లో చేరుస్తామంటూ రెండు సంవత్సరాల క్రితం అప్పటి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఇచ్చిన హామీ ఎమైందని ప్రశ్నించారు. రజక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. రజకుల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఎమిటో ఇక్కడే తెలిసిపోతుందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై స్పష్టత ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దుద్యల సాంబయ్య, ఎల్లారావు, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:14:24+05:30 IST