వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-27T05:21:53+05:30 IST

గ్రామ రెవెన్యూ సహయకుల (వీఆర్‌ఏల) న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్‌చేశారు

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

గుంటూరు (తూర్పు), జూలై 26: గ్రామ రెవెన్యూ సహయకుల (వీఆర్‌ఏల) న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్‌చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి హమీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. గత ప్రభుత్వం వీఆర్‌ఏలకు మూడు డీఏలను పెండింగ్‌లో పెడితే వైసీపీ ప్రభుత్వం ఏడు డీఏలను పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. వీఆర్‌ఏల జీతం రూ.21వేలకు పెంచాలని డిమాండ్‌చేశారు.  అనంతరం స్పందనలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాతూరి ప్రభాకరరావు, రోశయ్య, షేక్‌ బందగీ సాహెబ్‌, ముత్తయ్య, దాసరి పాలేసు, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-27T05:21:53+05:30 IST