బీమా మిత్రల నిరసన

ABN , First Publish Date - 2021-07-27T05:26:10+05:30 IST

గౌరవవేతనం రూ.3వేలు, పారితోషికం రెట్టింపు చేస్తానన్న ముఖ్యమంత్రి హమీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌ బీమా మిత్రలు డిమాండ్‌చేశారు.

బీమా మిత్రల నిరసన
డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీమామిత్రలు

గుంటూరు (తూర్పు), జూలై 26: గౌరవవేతనం రూ.3వేలు, పారితోషికం రెట్టింపు చేస్తానన్న ముఖ్యమంత్రి హమీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌ బీమా మిత్రలు డిమాండ్‌చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం బీమా మిత్రలు డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు బీమామిత్రల పనులను అప్పజెప్పడం దారుణమన్నారు. ఒక్క బీమామిత్రను కూడా తొలగించబోమని హమీ ఇచ్చి నేడు వారిని ముఖ్యమంత్రి రోడ్డున పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి. బీమా మిత్రలకు రావాల్సిన ఏడు నెలల పారితోషకాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీమా మిత్రలు వేదవతి, సౌజన్య, లక్ష్మి, మేరి సుజాత, మాణిక్యం, రమ్య, మాధవి, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-07-27T05:26:10+05:30 IST