నూతన ఆస్తి పన్నుపై నిరసన గళం

ABN , First Publish Date - 2021-06-17T04:43:13+05:30 IST

మునిసిపాలిటీల్లో అమలు చేస్తున్న నూతన ఆస్తి పన్ను విధానాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ, సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలో మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్‌ కార్యాలయాల ఎదుట వేర్వేరుగా ధర్నా నిర్వహించాయి.

నూతన ఆస్తి పన్నుపై నిరసన గళం
పలాస: మునిసిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించిఆందోళన చేస్తున్న కణితి విశ్వనాథం తదితరులు

బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా 

(ఆంధ్రజ్యోతి బృందం)

మునిసిపాలిటీల్లో అమలు చేస్తున్న నూతన ఆస్తి పన్ను విధానాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ, సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలో మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్‌ కార్యాలయాల ఎదుట వేర్వేరుగా ధర్నా నిర్వహించాయి. కొవిడ్‌ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును పెంచి అమలుచేసి అదనపు భారం వేసిందని ఆరోపించారు. దుకాణాలపై 30 శాతం పన్ను పెంచడం దారుణమన్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలను పంచుతూ మరో పక్క పన్నులు పెంచడం అన్యాయమన్నారు. తక్షణం పన్ను తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలను అందించారు.

 


 

Updated Date - 2021-06-17T04:43:13+05:30 IST