టీడీపీ శ్రేణుల నిరసన

ABN , First Publish Date - 2021-01-22T05:26:07+05:30 IST

టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావును అక్రమంగా అరెస్ట్‌ చేయడానికి వ్యతిరేకంగా గురువారం టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నాలు నిర్వహించాయి.

టీడీపీ శ్రేణుల నిరసన
శ్రీకాకుళంలో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు


కళా అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు

ధర్నా, నిరసన ర్యాలీలు

అక్రమ అరెస్టులే వైసీపీ లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 21: టీడీపీ నాయకుల ను అక్రమంగా అరెస్టు చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావును అరెస్టు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలసి గురువారం ఆందోళన చేపట్టారు. విగ్రహాలను ధ్వంసం చేసిన అసలు నిందితులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. నాయకులు ఎం.వెంకటేష్‌, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో రాక్షస పాలన

  నరసన్నపేట: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు. టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.  కార్యక్రమంలో నాయకులు జల్లు చంద్రమౌళి, గొద్దు చిట్టిబాబు, పీస కృష్ణ, బైరి భాస్కర రావు, బెవర రాము తదితరులు పాల్గొన్నారు. 


నిరసన ప్రదర్శన

 మెళియాపుట్టి/పాతపట్నం: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల మట సాగర్‌బాబు విమర్శించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును అరెస్ట్‌ చేసినందుకు వ్యతిరేకంగా గురువారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.వెంటరమణమూర్తి, సలాన మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


 


 

Updated Date - 2021-01-22T05:26:07+05:30 IST