వీఆర్వోల నిరసన

ABN , First Publish Date - 2021-12-03T06:27:44+05:30 IST

పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఎదు ట గురువారం వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

వీఆర్వోల నిరసన
గుత్తిలో నల్లబ్యాడ్జీలు ధరించి వీఆర్వోల నిరసన

గుత్తి రూరల్‌, డిసెంబరు 2: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం ఎదు ట గురువారం వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. గ్రామ రెవె న్యూ అధికారులు సచివాలయాల్లోకి వస్తే తరిమి కొట్టండంటూ మంత్రి అప్పలరా జు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వీఆర్వోల సర్వేతోనే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయన్నారు. నిరసనలోవీఆర్వోల సంఘం  మండల అ ధ్యక్షుడు భరత కుమార్‌, ఉపాధ్యక్షుడు సురేంద్ర, వీఆర్వోలు రామచంద్రా రెడ్డి, రా మాంజినేయులు, రామేశ్వర రెడ్డి, పవిత్ర, నాగలక్ష్మి, శారద, లింగమయ్య, అంజినేయులు, అంజి, తదితరులు పాల్గొన్నారు.


ఉరవకొండ: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి అప్పల రాజు వీ ఆర్వో, రెవెన్యూ సిబ్బందిపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని వీఆర్వోల సం ఘం నాయకులు నరసింహరాజు, రంగప్ప ఖండించారు. వీఆర్వోలు సచివాలయాలకు వస్తే తరమేయండని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు పిలుపునివ్వడం మంత్రి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సచివాలయాల ద్వారా అనేక సేవలు అందిస్తున్న వీఆర్వోల సమస్యలను పరిస్కరించకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమసంజసమన్నారు. మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు మనోహర్‌, భాస్కర్‌, అరుణ, నవ్యజ్యోతి, రాధ మ్మతదితరులు పాల్గొన్నారు. 


పామిడి: శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో వీఆర్వోలపై మంత్రి అప్పలరా జు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వీఆర్వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పె ద్దన్న ఆధ్వర్యంలో గురువారం వీఆర్వోలు నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం శాంతియుతంగా న్లలబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ పథకంలో వీఆర్వోలు ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. అయినప్పటికీ మంత్రి అప్పలరాజు వీఆర్వోలను సచివాలయంలోకి వస్తే తరిమికొట్టండి అంటూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సచివాలయంలోని సేవల్లో 90 శాతం వీఆర్వోలు చేస్తున్నారన్నారు. అలాంటి వీఆర్వోలపై మంత్రి అవగాహనా రాహిత్యంతో అనుచిత వ్యాఖ్యలుఅమానుషమన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనలో వీఆర్వోలు రవికాంత, శ్రీకాంతరెడ్డి, అమర్‌నాథ్‌, వెంకటరాముడు, రమేష్‌, ముత్యాలు పాల్గొన్నారు.


రాయదుర్గం రూరల్‌: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వీఆర్వోల సంఘం నాయకులు హరి, క్రిష్ణకీర్తి, వన్నూరప్పలు పే ర్కొన్నారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ రఘుకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో వుండి సచివాలయాలకు వీఆర్వోలు వస్తే తరిమివేయమనడం బాధాకరమన్నారు. వెంటనే మం త్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు కిరణ్‌, మణెమ్మ, నవీన పాల్గొన్నారు.


Updated Date - 2021-12-03T06:27:44+05:30 IST