జాబ్‌ క్యాలెండర్‌ను పునః ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:11:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలండర్‌లో తక్కువ సంఖ్యలో ఖాళీ చూపించిందని, మొత్తం ఖాళీలతో కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. నెల్లూరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జాబ్‌ క్యాలెండర్‌ను పునః ప్రకటించాలి
మాట్లాడుతున్న నాయకులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూన్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలండర్‌లో తక్కువ సంఖ్యలో ఖాళీ చూపించిందని, మొత్తం ఖాళీలతో కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. నెల్లూరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 25వేల ఉపాధ్యాయ పోస్టులు, 16 వేల కానిస్టేబుల్‌ పోస్టులు, లైబ్రరీ సైన్సు పోస్టులు 6వేలు... ఇలా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా వీటిని జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొనకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్‌లో గ్రూప్‌-1,2 కలిపి కేవలం 36 పోస్టులు ఉన్నాయని, గ్రూప్‌- 3,4 పోస్టుల ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌లో ఆ మేరకు వివరాలు ప్రకటించలేదన్నారు. జాబ్‌ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పీ శ్రీను, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌ ఖాసీం, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యూ ప్రసాద్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:11:43+05:30 IST