విద్యుత్‌ బకాయిలపై నిరసన

ABN , First Publish Date - 2021-03-09T05:55:46+05:30 IST

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులపై రాయితీ కల్పించినప్పటికీ అధికారులు మాత్రం బిల్లుల చెల్లించా లని డిమాండ్‌ చేస్తున్నారని మరుపల్లి గ్రామానికి చెందిన పలువురు తెలిపారు.

విద్యుత్‌ బకాయిలపై నిరసన

గజపతినగరం, మార్చి 8: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులపై రాయితీ కల్పించినప్పటికీ అధికారులు మాత్రం బిల్లుల చెల్లించా లని డిమాండ్‌ చేస్తున్నారని మరుపల్లి గ్రామానికి చెందిన పలువురు తెలిపారు. ఈమేరకు వారు సోమవారం స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 100 యూనిట్లు వరకు రాయితీ కల్పించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200 యూనిట్లు లోపువారికి రాయితీ కల్పించామని చెప్పారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ బిల్లు వచ్చిన వినియోగదారులు ఆరు నెలలుగా విద్యుత్‌బకాయిలు చెల్లింపులు చేపట్టలేదని అయితే ఆరునెలలకు సంబం ధించి ఒకేసారి బిల్లు చూపించి విద్యుత్‌ అధికారులు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేయడం దారుణమన్నారు. దీనిపై విద్యుత్‌శాఖ ఏఈ కరుణప్రియను వివరణ కోరగా గ్రామానికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతామాన్నరు. ఎస్సీ, ఎస్టీలు 200 యూనిట్లు బిల్లు పైబడితేనే బిల్లులు చెల్లించాలని చెప్పారు.  

 

Updated Date - 2021-03-09T05:55:46+05:30 IST