ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2022-08-18T04:54:03+05:30 IST

జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు గ్రామం ఎంఈవో కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం ఫ్యాప్టో సమాఖ్య ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.

ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన
జమ్మలమడుగు ఎంఈవో కార్యాలయంలో నిరసన తెలిపి వినతి పత్రం అందజేస్తున్న ఫ్యాప్టో సమాఖ్య ఉపాధ్యాయులు

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 17: జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు గ్రామం ఎంఈవో కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం ఫ్యాప్టో సమాఖ్య ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం తదితర వివరాలను అప్‌లోడ్‌ చేయటం, ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ తమ సొంత ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఇచ్చిన ఉత్తర్వుల పట్ల తామంతా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నామని వారు వినతి పత్రంలో కోరారు. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయటం వలన తమ సొంత ఫోన్లలో వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోందన్నారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని ఎంఈవో కార్యాలయంలోని సిబ్బందికి అందజేశారు. 

ప్రభుత్వమే బయోమెట్రిక్‌ యంత్రాలు అందించాలి

కలసపాడు, ఆగస్టు 17 : పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రకరకాల యాప్‌లను నిర ్వహించాలంటే ప్రభుత్వమే బయోమెట్రిక్‌ యంత్రాలు సరపరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో జిల్లా  కో- చైర్మన్‌ పి.రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలసపాడులో ఎంఈవో పుల్లయ్యకు ఈ మేరకు వినతి పత్రం అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సొంత మొబైల్స్‌లోనే యాప్‌లను నిర్వహించాలని  చెప్పడం సహేతుకం కాదని ఆయన పేర్కొన్నారు.  సర్వర్‌ నాణ్యత పెంచి సక్రమంగా పని చేసే బయోమెట్రిక్‌ యంత్రాలను సరఫరా చేసేంత వరకు మండలంలోని ఉపాధ్యాయులు అందరూ ముఖ చిత్ర హాజరు వేయబోమని ఫ్యాప్టో కలసపాడు మండలశాఖ పక్షాన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:54:03+05:30 IST