విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమం

ABN , First Publish Date - 2021-10-27T05:18:04+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తు న్నట్లు ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కేవీ.రమణ తెలిపారు.

విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమం
ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన

బుట్టాయగూడెం, అక్టోబరు 26: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తు న్నట్లు ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కేవీ.రమణ తెలిపారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న ఇఫ్టూ ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ గోడప్రతులను మంగళవారం ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి వాటిని తక్కువ ధరకు కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం అమ్మేస్తుందన్నారు. విశాఖ ఉక్కుకు 5 వేల కోట్లు పెట్టుబడి పెడితే నేడు 3 లక్షల కోట్లకు పైగా ఆస్తు లున్నాయని, 26 వేల ఎకరాల భూమి ఉందన్నారు. ఆదాయాన్నిచ్చే ఆస్తుల ను అమ్మితే ప్రభుత్వాల మనుగడ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం విరమించుకోవాలని  డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కె.కిషోర్‌, ఎం.ఏసు, కె.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


దేవరపల్లి: దేశ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంద ని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.నాగేశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభ కరపత్రాలను గౌరీపట్నంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆవిష్కరిం చారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని చూస్తుందన్నారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ నాయకులు కేవీ రమణ, పోలుమాటి పెంట య్య, ఎం.వెంకటేశ్వరరావు, గాజుల చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:18:04+05:30 IST