చెత్తతో నిరసన

ABN , First Publish Date - 2021-10-24T06:15:20+05:30 IST

తమ కార్యాలయం ఎదుట చెత్త వేశారంటూ అదే చెత్తతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిరసన తెలిపారు.

చెత్తతో నిరసన
చెత్తతో నిరసన చేస్తున్న సాంఘికసంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లు



అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 23: తమ కార్యాలయం ఎదుట చెత్త వేశారంటూ అదే చెత్తతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిరసన తెలిపారు. దామోదరం సంజీవయ్య సంక్షేమభవనం ఆవరణలోని సాంఘిక సంక్షేమశాఖ సహాయాధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) కార్యాలయం ఎదురుగా పంచాయతీరాజ్‌, ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఎస్‌ఈల కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఏఎస్‌డబ్ల్యూ ఓ కార్యాలయం ఎదురుగా చెత్త వేస్తుండటంతో వారు పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బం దితో వాగ్వాదం చేశారు. తమ కార్యాలయం ఎదుట వేసిన చెత్తతో ఏఎస్‌డబ్ల్యూఓ వార్డెన్లు ఆర్‌డ బ్ల్యూఎస్‌, పీఆర్‌ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగారు. మీ కార్యాలయం ఎదుట చెత్త వేస్తే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పటానికే నిరసన చేస్తున్నామని ఏఎస్‌ డబ్ల్యూఓ, వార్డెన్లు తెలిపారు. తమ కార్యాలయం ఎదుట చెత్త వేయడం ఆపకపోతే కార్యాలయం లోపల చెత్త వేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  ఆర్‌డ బ్ల్యూఎస్‌, పీఆర్‌ అధికారులు జోక్యం చేసు కుని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Updated Date - 2021-10-24T06:15:20+05:30 IST