కేజ్రీవాల్ ఇంటిపై దాడి.. హద్దు దాటడమే: కోర్టు

ABN , First Publish Date - 2022-04-06T01:37:51+05:30 IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై గత నెల 30న భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేతలు జరిపిన దాడిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

కేజ్రీవాల్ ఇంటిపై దాడి.. హద్దు దాటడమే: కోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై గత నెల 30న భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేతలు జరిపిన దాడిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సమాజానికి వ్యక్తులు ప్రమాదకరంగా మారుతున్నారని భావించినప్పుడు, వాళ్ల స్వేచ్ఛను అడ్డుకోవచ్చని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ ఇంటిపై బీజేవైఎం నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. బారికేడ్లను దాటుకుని మరీ, అక్కడి సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు బీజేవైఎంకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి బెయిలు విచారణ సందర్భంగా కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేయడం ద్వారా.. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు కల్పించిన ప్రాథమిక హక్కును నిందితులు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. అది కూడా వారికి తెలిసి.. కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారని అభిప్రాయపడింది. ప్రతి పౌరుడు చట్టానికి లోబడి, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలని సూచించింది. ప్రతి పార్టీకి నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, అయితే అది ఆంక్షలకు లోబడే ఉండాలని కోర్టు చెప్పింది.  

Updated Date - 2022-04-06T01:37:51+05:30 IST