మాస్కో, జనవరి 24: రష్యాలో విపక్ష నేత అలెక్సీ నావెల్నీని విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా 100 నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ 20 ఏళ్ల పాలనను నిరసిస్తూ.. శనివారం వేల మంది రోడ్డెక్కారు. ఒక్క మాస్కోలోనే 20 వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. నిరసనకారులపై లాఠీలు ఝళిపించారు. దేశవ్యాప్తంగా 3,500 మందిని అరెస్టు చేశారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో.. పలువురు గాయపడ్డారు.