వయోవృద్ధుల ఆశ్రమ కేంద్రంలో ఘనంగా మాతృ దినోత్సవం

ABN , First Publish Date - 2021-05-10T06:55:48+05:30 IST

దేవరకొండలోని వయోవృద్ధుల ఆశ్రమ కేంద్రంలో స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వయోవృద్ధుల ఆశ్రమ కేంద్రంలో ఘనంగా మాతృ దినోత్సవం
కేక్‌కట్‌ చేస్తున్న స్పోర్ట్స్‌ అసోసియేషన సభ్యులు, ఆశ్రమ నిర్వాహకురాలు సంధ్యారెడ్డి

దేవరకొండ, మే 9 : దేవరకొండలోని వయోవృద్ధుల ఆశ్రమ కేంద్రంలో స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ, వయోవృద్ధుల ఆశ్రమ కేంద్ర నిర్వాహకురాలు సంధ్యరెడ్డి కేక్‌కట్‌ చేసి వయోవృద్ధులకు స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులను ఆశ్రమ కేంద్రంలో వదిలివేయడం బాధాకరమన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్న అమ్మలకు స్పోర్ట్స్‌ అసోసియేషన అండగా ఉంటుందని, వారికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పోర్ట్స్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అసోసియేషన సభ్యులు కృష్ణకిషోర్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, సురేష్‌, కర్ణాకర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:55:48+05:30 IST