ఘనంగా ఒలింపిక్‌ డే రన్‌

ABN , First Publish Date - 2021-06-24T05:00:06+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రాణించాలని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆకాంక్షించారు.

ఘనంగా ఒలింపిక్‌ డే రన్‌
ఒలింపిక్‌ డే రన్‌లో అతిథులు, క్రీడాకారులు

కర్నూలు(స్పోర్ట్స్‌), జూన్‌ 23: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రాణించాలని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆకాంక్షించారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎంఏ రవూఫ్‌, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు బుధవారం కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్‌ డే రన్‌ను నిర్వహించారు. నగరంలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కేఈ ప్రభాకర్‌, కేడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి రన్‌ను ప్రారంభించారు. స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ పరుగు స్టేట్‌ బ్యాంకు సర్కిల్‌, చిల్డ్రన్స్‌ పార్కు, కోట్ల సర్కిల్‌, కోల్స్‌ కాలేజీ మీదుగా కొండారెడ్డి బురుజు నుంచి తిరిగి అక్కడి నుంచి స్పోర్ట్స్‌ అథారిటీ స్టేడియం వరకు ఈ క్రీడా జ్యోతి పరుగు సాగింది. కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతోనే క్రీడాజ్యోతిని మెరుగు పరిచినట్లు తెలిపారు. కబడ్డీ గంగాధర్‌, హర్షవర్ధన్‌ సురేంద్ర, షేక్షావలి, దాసరి సుధీర్‌, నాగరత్నమయ్య, పాండురంగారెడ్డి, సువర్ణ, విజయకుమార్‌, కిషోర్‌, ఎంఎంబీ బాషా, ఉషూ శ్రీనివాసులు, తైక్వాండో వెంకటేశ్వర్లు, సోహేల్‌, జోసెఫ్‌ వెంకటేశ్వర్లు, చిన్న సుంకన్న, సీహెచ్‌ చిట్టిబాబు, సాయి, ఆరీఫ్‌, సునీల్‌ కుమార్‌, రవి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:00:06+05:30 IST