ఘనంగా పార్వెట్‌ ఉత్సవం

ABN , First Publish Date - 2021-03-01T06:18:05+05:30 IST

బీర్‌పూర్‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్ర హ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పార్వెట్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా పార్వెట్‌ ఉత్సవం
పులిని వేటాడుతున్న నరసింహా స్వామి

బీర్‌పూర్‌, ఫిబ్రవరి 28: బీర్‌పూర్‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్ర హ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పార్వెట్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే బీర్‌పూర్‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నా ఘనంగా ప్రారంభమయ్యా యి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవదంపతులు లక్ష్మీనర సింహులు అటవీ ప్రాంతంలో పర్యటించిన ఘట్టంలో లక్ష్మీ కోరిక మేరకు నరసింహుడు పులిని వేటాడే సన్నివేశాన్ని అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేదమంత్రాలు పటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్‌ అర్చకులు రామాచార్యులు, సంతోష్‌, మధు, సంతోష్‌ భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:18:05+05:30 IST