ఘనంగా సైన్స్‌డే

ABN , First Publish Date - 2021-03-01T05:57:37+05:30 IST

జనవిజ్ఞాన వేదిక ఆదిలాబాద్‌ ఆధ్వ ర్యంలో సైన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో డా.సాగర్‌ మాట్లాడుతూ సీవీ రామన్‌ గొప్ప ఆవిష్కరణ వల్ల మన దేశానికి గొప్ప పేరు రావడం జరిగిందన్నారు.

ఘనంగా సైన్స్‌డే

ఆదిలాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 28: జనవిజ్ఞాన వేదిక ఆదిలాబాద్‌ ఆధ్వ ర్యంలో సైన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో డా.సాగర్‌ మాట్లాడుతూ సీవీ రామన్‌ గొప్ప ఆవిష్కరణ వల్ల మన దేశానికి గొప్ప పేరు రావడం జరిగిందన్నారు. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరు శాస్త్రవేత్తలుగా ఎదగాలని తెలిపారు. జన విజ్ఞాన వేదిక సైన్స్‌ దేశం కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రపంచ శాంతి కోసం అనే లక్ష్యాలతో పని చేస్తుందన్నారు. విద్యార్థులలో శాస్ర్తీయ అధ్యాయనం, శాస్త్రయ ఆలోచన, శాస్ర్తీ ఆచరణ అనే అంశాల పట్ల చైత న్యం పెంపొందించడం కోసం చెకుముకి సైన్స్‌ సంబురాలను నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు.  చెకుముకి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నూతుల రవీందర్‌, డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కిరణ్‌, పీజీహెచ్‌ఎం గోపాల్‌సింగ్‌, జిల్లా సైన్స్‌ అధికారి రఘురమణ, జన విజ్ఞాన వేదిక నాయకులు, మ్యూజిషియన్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:57:37+05:30 IST