కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , First Publish Date - 2021-05-07T06:23:23+05:30 IST

కరోనాసోకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు.

కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌, మే 6 : కరోనాసోకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. గురువారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరుగు తున్న నిర్మాణ పనులను, ప్రభుత్వ మాత, శిశు సంరక్షణ కేంద్రంలో స్కానింగ్‌ సెంటర్‌, ల్యాబ్‌, వోపీ వార్డు, పేషెంట్స్‌ వెయిటింగ్‌హాల్‌ పలు నిర్మాణ పనుల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌ దేవేం దర్‌ రెడ్డి, రజిని, స్వర్ణరెడ్డి, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 

రేషన్‌డీలర్ల భర్తీపై విచారణ చేపట్టాలి

ఫ కలెక్టర్‌కు వినతి పత్రం

నిర్మల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) సోన్‌ మండలంలోని పాక్‌పట్ల, మాదాపూర్‌, సాకెర గ్రామాల్లో నిర్వహించిన రేషన్‌ డీలర్ల ఎంపికలో విచారణ చేపట్టాలని పరీక్షలకు హాజరైన అభ్యర్థులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కొత్తగా డీలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకొని అధికారులు నిర్వహించిన పరీక్ష, ఇంట ర్వ్యూకు హాజరు అయ్యామన్నారు. డీలర్లపోస్టుల భర్తీని అధికారపార్టీకి చెందిన నాయకులు సూచించిన వారికి కేటాయించారని పేర్కొన్నారు. దీంతో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ కొత్తడీలర్ల భర్తీపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. లేని యెడల న్యాయస్థానంను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మ్యాక ప్రేమ్‌కుమార్‌, ప్రసాద్‌, బర్మసుమన్‌, గంట  స్రవంతి, ఉల్లెంగ ప్రవీణ్‌, దేవుల విద్యాసాగర్‌, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-05-07T06:23:23+05:30 IST