మెరుగైన వైద్యసేవలు అందించండి

ABN , First Publish Date - 2022-01-22T04:35:57+05:30 IST

‘టెక్కలి డివిజన్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయండి. ఆధునిక సౌకర్యాలతో సిద్ధం చేసిన నూతన జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఈ నెల 26న ప్రారంభించేందుకు చర్యలు చేప ట్టండి’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ వైద్యాధికారులు, ఏపీ ఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. కోట్లాది రూపా యల వ్యయంతో టెక్కలి నూతన జిల్లా ఆస్పత్రి భవనా లు నిర్మించినా.. వైద్యసేవల ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిని పరిశీలించారు. నూతన ఆస్పత్రి ప్రారంభానికి గల అడ్డం కులపై ఆరా తీశారు.

మెరుగైన వైద్యసేవలు అందించండి
డిప్యూటీ డీఎంహెచ్‌వోతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

26న టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రి ప్రారంభానికి చర్యలు : కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన 

టెక్కలి, జనవరి 21: ‘టెక్కలి డివిజన్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయండి. ఆధునిక సౌకర్యాలతో సిద్ధం చేసిన నూతన జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఈ నెల 26న ప్రారంభించేందుకు చర్యలు చేప ట్టండి’ అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ వైద్యాధికారులు, ఏపీ ఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. కోట్లాది రూపా యల వ్యయంతో టెక్కలి నూతన జిల్లా ఆస్పత్రి భవనా లు నిర్మించినా.. వైద్యసేవల ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ‘వైద్యం అందేదెప్పుడో’ అనే శీర్షిక తో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ స్పం దించి.. శుక్రవారం టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిని పరిశీలించారు. నూతన ఆస్పత్రి ప్రారంభానికి గల అడ్డం కులపై ఆరా తీశారు. ఆక్రమణల కారణంగా డ్రైనేజీ నిర్మా ణాల్లో జాప్యమవుతోందని ఏపీఎంఎస్‌ఐడీసీ డీఈఈ శిమ్మన్న తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఆస్పత్రికి అవసరమైన నిర్వహణ పనులు పూర్తిచేయండి. తాగునీరు, ఆక్సిజన్‌ సరఫరా పైపులైన్‌లు సిద్ధం చేయాలి. కరోనా వైరస్‌ మూడోదశ వ్యాప్తి దృష్ట్యా కొవిడ్‌ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలి’ అని ఆదేశించారు. జిల్లా కేంద్రా సుపత్రి నూతన భవనంలో ఏర్పాటుచేసిన వీఆర్‌ఎల్‌డీ ల్యాబ్‌ ను వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. రోజువారీ కరోనా పరీక్షల సామర్థ్యం, వాటిని నిర్వహించేందుకు ల్యాబ్‌ సిబ్బంది నియామకంపై  డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలారాణితో చర్చించారు. రోజుకి రెండువేల కరోనా పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని ఆమె కలెక్టర్‌కు వివరించారు. దశల వారీగా సామర్ధ్యం పెంచే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మట్‌, ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనుబాబు, తహసీల్దార్‌ హనుమంతరావు, వైద్యులు లక్ష్మణరావు, లక్ష్మీప్రసన్నలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T04:35:57+05:30 IST