ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-05-10T05:01:29+05:30 IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు విధుల నిర్వహణలో కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారని విశ్రాంత ఉద్యోగులు ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలి

- విశ్రాంత ఉద్యోగులు ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు



మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 9 : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు విధుల నిర్వహణలో కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారని విశ్రాంత ఉద్యోగులు ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10మంది ఉద్యోగులు విధి నిర్వహణలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఉద్యోగులకు తగిన ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ప్రతి రోజు ఆర్టీసీ ఆసుపత్రి ముందు కరోనా బారిన పడిన ఉద్యోగులు క్యూ కడుతున్నారని అన్నారు. ఆసుపత్రిలో సరియైున మందులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు టెలిమెడిసిన్‌ సౌకర్యం కల్పించిన కిట్‌లో మందులు అంతంత మాత్రమే ఉన్నాయని తెలిపారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు కిట్టను అందుబాటులో ఉంచాలని కోరారు. విశ్రాంతి ఉద్యోగులకు కూడా కిట్టు ఇవ్వాలని కోరారు. ఆర్‌.ఎం ఉషాదేవి స్పందించి ఉద్యోగులకు సరిపోను కిట్లు వచ్చేలా చూడాలని కోరారు.

Updated Date - 2021-05-10T05:01:29+05:30 IST