ఉద్యోగ భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2021-06-23T06:15:37+05:30 IST

తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌కు కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించండి
కలెక్టర్‌కు విన్నవించుకుంటున్న కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులు


కలెక్టర్‌కు  కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగుల వినతి 

అనంతపురం వైద్యం, జూన్‌ 22: తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌కు కాంట్రాక్టు పారామెడికల్‌ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్‌ను వారు కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం డీఎస్సీ ద్వారా ఎంపికైనా కాంట్రాక్టు పద్ధతిలోనే పని చేస్తున్నామన్నారు. ఏళ్లుగా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తూ భంగపడుతున్నామన్నారు. సీఎం జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారనీ, ఆ మేరకు తమకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్‌, జిల్లా జేఏసీ కన్వీనర్‌ రాఘవేం ద్ర, కో కన్వీనర్‌ హరికృష్ణ, నారాయణస్వామి, ముకుంద, బాబా, వైసీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T06:15:37+05:30 IST