విష్ణునివాసంలో అధికారులకు సూచనలిస్తున్న రాజశేఖర్, కనకనరసారెడ్డి
తిరుపతి(రవాణా), జనవరి 20: కొవిడ్ బాధితులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జేసీ రాజశేఖర్ ఆదేశించారు. విష్ణునివాసం కొవిడ్ సెంటర్ను ఆర్డీవో కనకనరసారెడ్డితో కలిసి తనిఖీచేశారు. ఈ సందర్భంగా కొవిడ్ బాధితులకు అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీసారు. ఆర్ఐ జానీబాష, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.