విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ABN , First Publish Date - 2021-03-06T05:06:26+05:30 IST

విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందిం చాలని డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మాచారెడ్డి మండలంలోని భవానీపేట్‌ గ్రామ పరిధిలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం తని ఖీ చేశారు.

విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
కేజీబీవీ పాఠశాలలో కూరగాయలను పరిశీలిస్తున్న డీఆర్‌డీవో

డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి
మాచారెడ్డి, మార్చి 5: విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందిం చాలని డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మాచారెడ్డి మండలంలోని భవానీపేట్‌ గ్రామ పరిధిలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం తని ఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుకున్నారు. వంటశాలకు వెళ్లి కూరగాయలను పరిశీలించారు. స్టోర్‌రూంకు వెళ్లి చూశారు. మొదట వాటరింగ్‌ డేలో పాల్గొని మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను బతికించాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలకు నీటిని పోస్తూ వాటిని బతికించాలని కోరారు. రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. ఎవరు కూడా హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, ఈసీ, సర్పంచ్‌లు సునీత, మద్దెల రాజు, ఉప సర్పంచ్‌లు రమేష్‌గౌడ్‌, జితేందర్‌రెడ్డి, గ్రామస్థులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:06:26+05:30 IST