కోచింగ్ సెంటర్‌లో ఓ యువకుడి రచ్చ.. రంపంతో లోపలికి ప్రవేశించి డైరెక్టర్‌పై దాడి.. ఫీజు కోసం ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-14T08:34:10+05:30 IST

ఓ వ్యక్తి రంపం పట్టుకుని కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించాడు.. అక్కడ కోచింగ్ సెంటర్ యజమానిపై దాడికి యత్నించాడు.. అడ్డువచ్చిన విద్యార్థులను గాయాల పాలు చేశాడు.. కొద్ది గంటల హైడ్రామా తర్వాత అందరూ...

కోచింగ్ సెంటర్‌లో ఓ యువకుడి రచ్చ.. రంపంతో లోపలికి ప్రవేశించి డైరెక్టర్‌పై దాడి.. ఫీజు కోసం ఎంత పని చేశాడంటే..

ఓ వ్యక్తి రంపం పట్టుకుని కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించాడు.. అక్కడ కోచింగ్ సెంటర్ యజమానిపై దాడికి యత్నించాడు.. అడ్డువచ్చిన విద్యార్థులను గాయాల పాలు చేశాడు.. కొద్ది గంటల హైడ్రామా తర్వాత అందరూ కలిసి అతడిని పట్టుకుని చితక్కొట్టారు.. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. 


పాట్నా నగరంలోని కచోరి గలీ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్‌లోకి మతి స్థిమితం లేని ఓ యువకుడు ప్రవేశించి ఆ సంస్థ డైరెక్టర్‌పై రంపంతో దాడికి ప్రయత్నించాడు. కోచింగ్‌ సెంటర్‌ను ధ్వంసం చేసి.. నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు వచ్చిన విద్యార్థులపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి అతడిని పట్టుకుని కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. 


పోలీసుల సమాచారం ప్రకారం ఆ యువకుడు గతంలో కంప్యూటర్ క్లాస్ కోసం ఆ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయి ఫీజు కట్టాడు. కొద్ది రోజుల తర్వాత మానేశాడు. ఫీజు వాపసు ఇవ్వాలని డైరెక్టర్‌ను అడిగాడు. అందుకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నిరాకరించాడు. దాంతో అతనిపై కోపం పెంచుకున్న యువకుడు దాడికి యత్నించాడు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-04-14T08:34:10+05:30 IST