మానసిక అవధి 18000

Sep 27 2021 @ 02:13AM

టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం 17200 వరకు దిగజారినప్పటికీ బలమైన రికవరీ సాధించి చివరికి 270 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ఇప్పుడు ప్రధాన మానసిక అవధి 18000 చేరువలో ఉంది. గత 8 వారాలుగా నిరంతర ర్యాలీ సాధించి 2500 పాయింట్ల వరకు లాభపడింది. అలాగే గత 18 నెలల కాలంలో 11000 పాయింట్ల వరకు లాభపడింది. టెక్నికల్‌గా అప్‌ట్రెండ్‌లోనే ఉన్నా మధ్యకాలిక చార్టుల ఆర్‌ఎస్‌ఐ సూచీ 92 శాతం ఉంది. ఓవర్‌బాట్‌ స్థితి కొనసాగుతోంది. ఈ గరిష్ఠ స్థాయిల్లో కొత్త ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.


 గత కొద్ది వారాలుగా ప్రతి ఒక్క నిరోధాన్ని అవలీలగా ఛేదిస్తూ ప్రతి ఒక్క మద్దతు స్థాయి వద్ద రికవరీ సాధిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు పరిగణనలోకి తీసుకుంటే ఈ వారంలో ఫ్లాట్‌గా ప్రారంభం కావచ్చు. 18000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. 


బుల్లిష్‌ స్థాయిలు:

నిరోధ స్థాయిలు 18000, 18050. కన్సాలిడేషన్‌ అనంతరం మార్కెట్‌ ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. కన్సాలిడేషన్‌ పూర్తి చేసుకుని నిలదొక్కు కున్న తర్వాతే మరింత అప్‌ట్రెండ్‌లో పయనిస్తూ కొత్త గరిష్ఠ స్థాయిలకు ప్రయాణం సాగిస్తుంది. 


బేరిష్‌ స్థాయిలు:

18000 వద్ద విఫలమైతే కరెక్షన్‌ ఏర్పడవచ్చనేందుకు సంకేతంగా భావించాలి. ప్రధాన మద్దతు స్థాయి 17600. అంతకన్నా దిగజారితే ఇతర ప్రధాన మద్దతు స్థాయిలు 17300, 17000. ఇది మూడు వారాల కనిష్ఠ  స్థాయి, స్వల్పకాలిక మద్దతు స్థాయి. 


బ్యాంక్‌ నిఫ్టీ:

ఈ సూచీ గత వారం ఫ్లాట్‌గా ముగిసింది. ఆల్‌టైమ్‌ హై 37800 వద్ద నిలిచింది. నిరోధ స్థాయి 38100. ఆ పైన నిలదొక్కుకుంటే ర్యాలీ కొనసాగుతుంది. మద్దతు స్థాయిలు 37600, 37000. 


పాటర్న్‌: గత వారం ఈ నెల 17న ఏర్పడిన టాప్‌ వద్ద బ్రేకౌట్‌ సాధించినందు వల్ల టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ అవకాశాలు న్నాయి. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. 18000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఉంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ రేఖ కన్నా పైన నిలదొక్కుకోవాలి. మార్కెట్‌ ప్రస్తుతం 25, 50 డిఎంఏల కన్నా చాలా పైన ఉన్నందు వల్ల సాధారణ పరిస్థితుల్లో తక్షణ డౌన్‌ట్రెండ్‌ ప్రమాదం లేదు.  


టైమ్‌: ఈ సూచీ ప్రకారం సోమవారం తదుపరి రివర్సల్‌ ఉంటుంది. వీక్లీ చార్టుల ప్రకారం సైతం ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది. 

సోమవారం స్థాయిలు

నిరోధం : 17920, 18000

మద్దతు : 17770, 17700

ఆర్తి ఇండస్ర్టీస్‌  

ప్రస్తుత ధర రూ.915

www.sundartrends.in

గత కొద్ది వారాలుగా సైడ్‌వేస్‌ ధోరణిలో ట్రేడవుతూ రూ.990 నుంచి రూ.880కి దిగజారింది. గత వారం రూ.900 కన్నా పైన క్లోజైంది. ఏ మాత్రం తగ్గినా కొనడానికి ప్రయత్నించవచ్చు. నిరోధ స్థాయిలు రూ.960, రూ.1000.రూ.880 కన్నా దిగజారితే స్వల్ప కాలానికి ఎగ్జిట్‌ కావచ్చు.

టెక్‌ బెట్స్‌

బజాజ్‌ ఆటో : ప్రస్తుత ధర రూ.3,809

గత కొద్ది నెలలుగా సైడ్‌వేస్‌లో ట్రేడవుతూ రూ.4,300 నుంచి రూ.3,700కి దిగజారింది. గత వారం రూ.3,800 కన్నా పైన క్లోజైంది.  ఏ మాత్రం తగ్గినా కొనవచ్చు. నిరోధ స్థాయిలు రూ.4,000, రూ.4,250. రూ.3,680 కన్నా దిగజారితే స్వల్పకాలానికి ఎగ్జిట్‌ కావచ్చు.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.