పీటీడీ ఆదాయం రూ.5.17 లక్షలు

ABN , First Publish Date - 2022-05-19T06:37:00+05:30 IST

రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రజా రవాణాశాఖ(పీటీడీ)కు రూ.5,17,505 ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్‌ రోణంకి సీతారాంనాయుడు తెలిపారు.

పీటీడీ ఆదాయం రూ.5.17 లక్షలు
మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణాధికారి సీతారాంనాయుడు

- మోదకొండమ్మ ఉత్సవాలకు 16 బస్సులు నడిపాం

- డిపో మేనేజర్‌ రోణంకి సీతారాంనాయుడు

పాడేరురూరల్‌, మే 18: రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందిన స్థానిక మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రజా రవాణాశాఖ(పీటీడీ)కు రూ.5,17,505 ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్‌ రోణంకి సీతారాంనాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 15 నుంచి 17వ తేదీ వరకు మోదకొండమ్మ ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని నాలుగు డిపోలకు సంబంధించిన 16 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా అల్లూరి జిల్లా కేంద్రం నుంచి నడిపామన్నారు. గత రెండేళ్లుగా ఉత్సవాలు జరగకపోవడంతో ఈసారి పీటీడీకి ఎక్కువ ఆదాయం వస్తుందని భావించామని, అయితే అనుకున్నంత రాలేదన్నారు. ఎక్కువ మంది సొంత కార్లు, ప్రైవేటు వాహనాల్లో రావడం వల్ల ఆశించిన ఆదాయం రాలేదని ఆయన తెలిపారు.

Updated Date - 2022-05-19T06:37:00+05:30 IST